– జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి తనిఖీ
– వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం: రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్
నవతెలంగాణ- జోగిపేట
”మీరు మారరా.. ఎన్నిసార్లు ఫిర్యాదులు వస్తాయి.. ఎందుకిలా చేస్తు న్నారు” అంటూ.. జోగిపేట ఏరియా ఆస్పత్రి వైద్యులపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని బుధవారం ఉదయం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజరు కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి పై విధంగా స్పందించారు. సమయానికి డ్యూటీకి రాక పోవడం తో వైద్యులపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తనిఖీ చేసిన సమయంలో ఆర్‌ఎంఓ అశోక్, డ్యూటీ డాక్టర్లు శ్రావణి, సతీష్ కుమార్ గౌడ్ మాత్రమే డ్యూటీలో ఉన్నారు. మిగిలిన 22 మంది సమయానికి రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు సమయానికి రాకున్నా వారు వచ్చినట్టు రిజిస్టర్‌లో ముందుగానే సంతకాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అందరి సంతకాలు ముందుగా వచ్చిన వైద్యులు ఎలా చేస్తారంటూ నిలదీశారు. ప్రతిరోజూ ఇలాగే జరుగుతుందా అని ప్రశ్నిం చారు. డ్యూటీ రిజిస్టర్‌లో ఆబ్సెంట్ వేసి రిమార్కులు రాశారు. డ్యూటీకి సరిగ్గా రాని వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం గా ఉంటే సస్పెన్షన్ తప్పదంటూ డాక్టర్లను కమిషనర్ హెచ్చరించారు.
మీరు మారరా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



