Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి చెక్క అందజేత

బాధిత కుటుంబానికి చెక్క అందజేత

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
ప్రాథమిక సహకార సంఘంలోని సభ్యులు ప్రమాదశాస్తు మరణిస్తేబాధిత కుటుంబలకు ఎల్లప్పుడూ సంఘం ఆదుకుంటుందని పెద్ద కోడప్ గల్ సోసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి తెలిపారు. సోమవారం రోజున పెద్ద కోడప్ గల్ మండలంలోని శివాపూర్ గ్రామానికి చెందిన బస్సి మాధు జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జనతా పర్సనల్ యాక్సిడెంట్ భిమా ద్వారా రెండు లక్ష రూపాయలు మంజూరు కాగా,బాధితుని భార్య బస్సీ సవితకు సహకార కేంద్రంలో భీమా చెక్కను అందజేశారు. ఈ కార్యక్రమం సోసైటీ పర్సనల్ వైస్ చైర్మన్ సంగారెడ్డి,సోసైటీ డైరెక్టర్ నాగిరెడ్డి, భారతీయ కిసాన్ సంఘం పెద్ద కోడప్ గల్ గ్రామ అధ్యక్షులు కుమార్ సింగ్,మండల కిసాన్ సంఘం సహాయ కార్యదర్శి మల్లి కార్జున్ యాదవ్,తానాజీ రావ్ పాటిల్,సోసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -