– మా రాష్ట్రంలోనూ ఇదే తరహా పద్ధతికి సిఫారసు చేస్తాం : బీహార్ గ్రూప్-1 అధికారుల బృందం ప్రశంసలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీహార్ గ్రూప్ -1 అధికారులు మంగళవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ”సీఎం ప్రజావాణి”ని సందర్శించారు. ఆ కార్యక్రమం అమలు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి , నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ప్రజావాణి పనితీరును వివరించారు. దీన్ని అమలు చేస్తున్న విధానం బాగుందనీ, ఇలాంటి మంచి కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ లేదని అధికారుల బృందం అభిప్రాయపడింది. బీహార్‌లోనూ ఇదే తరహా పద్ధతులు అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ సందర్బంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ సీఎం ప్రజావాణిలో నమోదయ్యే దరఖాస్తులలో 68 శాతం వెంటనే పరిష్కారమవుతున్నాయని తెలిపారు.
‘సీఎం ప్రజావాణి’ పని తీరు భేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES