Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూడు రోజుల్లో ఫంక్షన్ హాల్ పనులు పూర్తి చేయాలి 

మూడు రోజుల్లో ఫంక్షన్ హాల్ పనులు పూర్తి చేయాలి 

- Advertisement -

కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ 
నవతెలంగాణ – పాలకుర్తి

ఇందిరా మహిళా శక్తి ఎస్ఎల్ఎన్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ పనులను మూడు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలో గల ఎస్ఎల్ఎన్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ ను సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డైనింగ్ హాల్ పనులు నతనడకన సాగుతున్నాయని తెలిపారు. పనుల్లో వేగం పెంచి త్వరిత గతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గుత్తేదారులు నిర్లక్ష్యం వీడలని, సకాలంలో పనులు పూర్తి చేసి మండల సమైక్యకు ఫంక్షన్ హాల్ అప్పగించాలని ఆదేశించారు. ఫంక్షన్ హాల్ను వాడుకలోకి తీసుకురావడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. త్వరలోనే ఫంక్షన్ హాల్ ప్రారంభించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి వసంత, ఏపీడి ఎండి నూరొద్దీన్, డిపిఓ స్వరూప, తహసిల్దార్ నాగేశ్వర చారి, డిపిఎం జన్ను ప్రకాష్, ఎంపీడీవో రవీందర్, ఏపీఎం శ్రీరాముల చంద్రశేఖర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు గునిగంటి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బేజాడి సుమలత, కోశాధికారి గాదరి ప్రమీల తోపాటు సిసి కారుపోతుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -