Sunday, January 25, 2026
E-PAPER
Homeక్రైమ్అప్పుల బాధతో కార్మికుడు ఆత్మహత్య

అప్పుల బాధతో కార్మికుడు ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్
అప్పుల బాధతో గ్రామపంచాయతీ కార్మికుడు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మంగ్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివకుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మంగ్లూరు గ్రామానికి చెందిన గైని శ్యామయ్య (40) తన గ్రామంలో ఇల్లు నిర్మించి, ట్రాక్టర్ కొనడం వలనా అప్పులు ఎక్కువగా అయి తీవ్ర మనస్తాపం చెంది శనివారం ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఎస్సై తెలిపారు. శ్యామయ్య గ్రామంలో వాటర్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని కొడుకు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -