Thursday, February 5, 2026
E-PAPER
Homeక్రైమ్చెరువులో మునిగి కార్మికుడు మృతి

చెరువులో మునిగి కార్మికుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
కాలకృత్తాలకు చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మరణించిన ఘటన పట్టణంలోని హరిజనవాడ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలనీకి చెందిన జనార్ధన్ (43) మేస్త్రి పని పనిచేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం జనార్ధన్ మేస్త్రి పని నిమిత్తం ఇంటి నుండి బయలుదేరి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గ్రామ సమీపంలో ఉన్న కోచెరువులో జనార్ధన్ శవమై తేలుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువుల నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి మృతుడి భార్య ప్రేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై డి. ఆంజనేయులు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -