పలు డిపోల్లో ఆందోళన.. బ్యాడ్జీలతో విధుల నిర్వహణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ సంస్థతోపాటు ఆస్తులను రక్షించాలనీ, బస్‌భవన్‌లోని ఏ బ్లాక్ ను కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించిన ఉత్తర్వులు రద్దు చేయాలనీ, విద్యుత్ బస్‌ల విధానంలో మార్పులు చేయాలనీ, విద్యుత్ బస్సుల పేరుతో ప్రప్రథమం గా గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని కార్మికులను బయటి జోన్లకు పంపే చర్యలు ఆపాలనే డిమాండ్లతో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్ ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఆర్టీసీ రక్షణ దినం పాటిం చారు బ్యాడ్జీలు ధరించి కార్మికులు విధులు నిర్వహిం చారు. రాష్ట్రంలోని సూర్యాపేటలో సంఘం రాష్ట్ర కార్యదర్శి డి సుధాకర్, హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో ఉపాధ్యక్షులు కృష్ణ, వరంగల్ 1 డిపో వద్ద రాష్ట్ర కార్యదర్శి డియూ చారి పాల్గొన్నారు. సమస్యల తోకూడిన వినతిపత్రాలను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు వైస్ చైర్మెన్ మేనేజంగ్ డైరెక్టర్‌కు ఇచ్చారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొనాలనీ, ఆర్టీసీ రక్షణకు చర్యలు తీసుకొనాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేసారు. ఉమ్మడి ఆస్తుల విషయం లో ఇంతకు ముందు చేసుకొన్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని కార్మికులు డిమాండ్ చేసారు. ఈమేరకు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ప్రధానకార్యదర్శి విఎస్ రావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆర్టీసీ రక్షణ దినం పాటించిన కార్మికులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



