పనిదినాలు తగ్గించి.. వేతనాలు పెంచాలని డిమాండ్
దక్షిణ కొరియాలో భారీ ప్రదర్శన
సియోల్ : అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు గళమెత్తారు. దక్షిణ కొరియా లోని సెంట్రల్ సియోల్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. పనిదినాలు, వేతనాలతో పాటు పలు అంశాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం కార్మికులకు 5 శాతం వేతన పెంపు, వారానికి నాలుగున్నర రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోరుతూ.. టీ-షర్టులు ధరించిన కార్మికులు నినదించారు. సియోల్‌లోని చారిత్రాత్మక పౌర ప్లాజా అయిన గ్వాంగ్‌వామున్ స్క్వేర్ గుండా బ్యానర్లు, ప్లకార్డులను పట్టుకుని కవాతు చేశారు. తక్కువ పని వారాన్ని డిమాండ్ చేస్తూ పాడిన పాటలు మార్మోగాయి. చాలా మంది నిరసనకారులు ‘జనరల్ స్ట్రైక్’ అనే పదంతో ఎర్రటి హెడ్‌బ్యాండ్ లను ధరించి ప్రదర్శనలో కదంతొక్కారు. పడిపోతున్న జనన రేటును తిప్పికొట్టడానికి తక్కువ పని దినాలు చాలా కీలకంగా మారతాయని యూని యన్ నాయకులు వాదిస్తు న్నారు. దక్షిణ కొరియాలో స్త్రీల సంతానోత్పత్తి రేటు 0.75తో ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. ప్రస్తుత పోకడలు కొనసాగితే 2072 నాటికి జనాభా దాదాపు మూడింట ఒక వంతు తగ్గుతుందని అంచనా.
దక్షిణ కొరియా ఉత్పాదకత యూఎస్, జర్మనీ, నెదర్లాండ్స్ కంటే వెనుకబడి ఉంది. ఓఈసీడీ డేటా ప్రకారం 2023లో కొరియన్ కార్మికులు గంటకు జీడీపీలో 54.64 డాలర్ల మేర ఉత్పత్తి చేశారు, ఇది ఓఈసీడీ దేశాల్లో 10వ అత్యల్పం. యూఎస్‌లో 97.05 డాలర్లు, జర్మనీలో డాలర్లు 93.72 ఉన్నది. రికార్డు స్థాయిలో తక్కువ జనన రేటుతో ఇబ్బంది పడుతున్న జపాన్, పని ప్రదేశాల సౌలభ్యాన్ని కొంతమేర ప్రవేశపెట్టింది. స్థానిక మీడియా ప్రకారం, కొన్ని స్థానిక జపాన్ ప్రభుత్వాలు, ప్రయివేట్ కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగులు పని, కుటుంబాన్ని సమతుల్యం చేసుకోవడంలో సహాయపడటానికి నాలుగు రోజుల పనివారాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.కార్పొరేట్ కొరియా అంతటా పెరుగుతున్న కార్మికుల వ్యతిరేక తను ప్రతిబింబించే డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు పదవీ విరమణ వయస్సు పొడిగింపును కూడా ఒత్తిడి చేస్తు న్నాయి. ఇటీవల కొన్ని యూనియన్లతో వేతన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఉత్పత్తికి అంతరాయం కలిగించే వివాదాలను పరిష్కరించుకున్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ ఏడాది చివర్లో తక్కువ పని వారానికి కుదించే బిల్లును ప్రతిపాదించాలని యోచిస్తు న్నట్టు సమాచారం. గతంలో కార్మిక సంఘాలకు ప్రభుత్వం హామీ లిచ్చినా.. సమస్యలు పరిష్కారం కాలేదని కార్మికసంఘాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోని.. యాజమాన్యాలపై తగినరీతిలో ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నాయి.
హక్కుల కోసం గళమెత్తిన కార్మికులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES