Sunday, September 21, 2025
E-PAPER
Homeకరీంనగర్ఉత్పత్తి కులాల అభ్యున్నతి కోసం కృషి..

ఉత్పత్తి కులాల అభ్యున్నతి కోసం కృషి..

- Advertisement -

కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

ఉత్పత్తి కులాల అభ్యున్నతి కోసం కృషిచేసిన గొప్ప మహనీయుడు స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తంగళ్ళపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపల్లి ఆనందం, పద్మ నగర్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు మోర శ్రీకాంత్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు పద్మశాలి ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతిని పద్మశాలి సంఘం సభ్యులు ఆదివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పద్మశాలి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు.

అలాగే పద్మ నగర్ లోని పద్మశాలి సేవా సంఘంలో ఆయన చిత్రపటానికి పద్మశాలి సంఘ సభ్యులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కొండ లక్ష్మణ్ బాపూజీ చేనేత, వడ్రంగి, కంసాలి, కంచర, మేధర, బెస్త, కల్లుగీత కార్మికులు, దర్జీలు, వడ్డెరులు వంటి ఉత్పత్తి కులాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు.

చేనేత ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం 1952లో ‘హైకో’ను ఏర్పాటు చేశారన్నారు.తెలుగు నేలపై సైకిల్ యాత్ర, పాదయాత్రలకు ఆయన శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోరా రాజు, మాజీ సర్పంచ్ అంకారపు రవీందర్, యూత్ అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మచ్చ ఆంజనేయులు, సామల రమేష్, కోడం రమేష్, సామల గణేష్, పద్మశాలి సేవా సంఘం పద్మనగర్ ప్రధాన కార్యదర్శి కుమ్మరి కుంట శ్రీహరి, కోశాధికారి సామల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఉడుత సంతోష్, తేల బాల నారాయణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -