– శ్రమ ఎక్కువ…ఆదాయం తక్కువ
– అఖిల భారత అసంఘటిత కార్మికుల సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలోని అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ఆ దిశగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బలమైన ఆలోచన చేస్తున్నారని తెలిపారు. అసంఘటిత కార్మికుల శ్రమ ఎక్కువని, కానీ వారి ఆదాయం చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. అంతేకాక వారికి సరియైన గుర్తింపు ఉండదని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో నిర్వహించిన అఖిల భారత అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత కార్మికుల్లో అణగారిన, వెనుకబడిన సామాజిక తరగతులకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అసంఘటిత కార్మికుల సాధక బాధకాలను గతంలో రేవంత్‌రెడ్డి విన్నారని గుర్తు చేశారు. కార్మికుల కష్టాన్ని ముఖ్యమంత్రి గుర్తిస్తారని భరోసా ఇచ్చారు. కార్మికుల శ్రేయస్సు కోసం పార్టీ పరంగా సీఎంతో చర్చిస్తానన్నారు. తర్వాత అసంఘటిత కార్మికులతో సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారత అసంఘటిత కార్మిక, ఉద్యోగుల జాతీయ చైర్మెన్ ఉదిత్‌రాజు, వైస్ చైర్మెన్ షేక్ ఇబ్రహీం, ఏఐసీసీ సభ్యులు జెట్టి కుసుమ కుమార్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర చైర్మెన్ కౌశల్ సమీర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఇన్‌చార్జి ఎస్.జగదీశ్వర్‌రావు తదితరులు హాజరయ్యారు.
మార్వాడీలను వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదు
మార్వాడీలు మనలో ఒకరని…వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఆవరణలో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించా లంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించామని తెలిపారు. ఎవర్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారో తెలుసుకుంటామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ అంశంపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు.
అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES