- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పురస్పాలక సంఘం పట్టణ అభివృద్ధి కొరకు ఐక్యతతో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, పురపాలక చైర్పర్సన్ బీజాని బాలమణి భాస్కర్ అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి, ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక, పట్టణ ప్రగతిలో భాగంగా శివాలయం గుడి దగ్గర 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమo నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ బి జగన్మోహన్, వార్డు కౌన్సిలర్లు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



