ముస్తాబైన సుందరయ్య విజ్ఞాన కేంద్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వర్కింగ్ ఉమెన్ జాతీయ కన్వెన్షన్ శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్వీకేలో సీఐటీయూ నాయకులు ఏర్పాట్లు చేశారు. కన్వెన్షన్‌కు సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత, ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌తో పాటు జాతీయ నాయకులు, అన్ని రాష్ట్రాల శ్రామిక మహిళ విభాగం నాయకత్వ ప్రతినిధులు, పాల్గొననున్నారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పోరాటాల రూపకల్పనపై కన్వెన్షన్‌లో ప్రధానంగా చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించను న్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, మెడికల్, తదితర ప్రభుత్వ స్కీమ్‌లలో పనిచేసే వర్కర్లు, నిర్మాణ రంగం, కూలీ పనులు, హాస్టళ్లు, ఆస్పత్రులు, వ్యవసాయం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వాలు, పరిశ్రమల యాజమాన్యాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్న విషయం విదితమే. అనేక సంస్థల్లో ప్రసూతి సెలవులు అమలు కావడం లేదు. క్రెచ్ సౌకర్యాల్లేవు. పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు తీవ్రమవుతున్నాయి. చాలా సంస్థల్లో లైంగిక అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఉండట్లేదు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. దీంతో పనిప్రదేశాల్లో మహిళా శ్రామికుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.
కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ శాశ్వత, సామాజిక భద్రత కల్పించాలనే డిమాండ్‌ను ప్రభుత్వాల ముందుకు బలంగా తీసుకెళ్లేందుకు కన్వెన్షన్‌లో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నారు. జాతీయ కన్వెన్షన్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కోరారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం పద్మశ్రీ, మల్లికార్జున్, భూపాల్, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, కుమారస్వామి, ఏ నాగేశ్వరరావు, పి సుధాకర్ తదితరులు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
నేడు, రేపు హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్ జాతీయ కన్వెన్షన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



