స్థానిక సమస్యలను పరిష్కారానికై హామీ ఇచ్చిన డిఎంహెచ్వో రాజశ్రీ
ఆషా లకు ఏఎంసీ టార్గెట్ రద్దు చేయాలి
క్వాలిటీ ట్యాబ్ ఇవ్వకుండా ఆన్ లైన్ చెయ్యమని చెప్పడం ఇది అన్యాయం
ప్రభుత్వ ధవఖానలో ఆశాలకు రెస్ట్ రూమ్ ఇవ్వాలి డాక్టర్ల వైఖరిని అరికట్టాలి
ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18 వేలు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి
ఆశ వర్కర్ల పోరాటాలకు సంఘీభావం తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు
నవతెలంగాణ – కంఠేశ్వర్
కాంగ్రెస్ సర్కార్ ఆశ వర్కర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలి అని,ఆశా వర్కర్లకు పని భారాన్ని తగ్గించుకుంటే పోరాటాలను ఉదృతం చేస్తాం అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ధర్నా చౌక్లో వందలాది మందితో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా శిబిరానికి డిఎంహెచ్వో రాజశ్రీ వచ్చి స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని, ఆన్ లైన్ విధానాన్ని రద్దు చేయాలని లేదు అనుకుంటే క్వాలిటీ ట్యాబ్ ఇచ్చి నెట్ బ్యాలెన్స్ వెయ్యాలని, ఎన్సిడి స్క్రీనింగ్, నిక్షయ (టీబి స్పూటం డబ్బులు మొయ్యాలని లేదు అనుకుంటే ఆన్లైన్ చేయాలని కచ్చితంగా నెలకు 10 మంది పేర్లు తేమడ టెస్టులు ఇవ్వాలని టార్గెట్ పెట్టారు (ఏ ఎన్ సి నాలుగు గర్భవతులు ఉండాలని టార్గెట్ పెట్టారు. ఒక్క నెలలో 10 ఉండొచ్చు కానీ ఒక్క నెలలో జీరో ఉండవచ్చు ఏం పని చేస్తున్నావ్ టార్గెట్ పూర్తి చేయాలి కదా అని ఆశలను బెదిరిస్తున్నారు. డెలివరీ ఉంటేనే డబ్బులు లేకుంటే లేదు అని బెదిరిస్తున్నారు.
జాబ్ చాట్ ఇవ్వాలని ఆశలకు ఓపి డ్యూటీలు వేస్తున్నారు.. కానీ ఆశ వర్కర్ల పని ఫీల్డ్ వర్క్ ఉండాలని బుధవారం శనివారం ఇమినేషన్ డ్యూటీ ఉంటుంది. కానీ ఆశలకు ఓపి డ్యూటీలు చేయాలని, డెలివరీ కేసులను ప్రభుత్వ దవఖానలో తీసుకొనిపోతే ఆశాలు అంటేనే చిన్న చూపు చూస్తున్నారు. డాక్టర్లు ఏ ఆశ బయటకు నడు అనే పదాలను వాడుతున్నారు కనీసం గౌరవం కూడా లేకుండా పోతుంది. ప్రభుత్వ దవాఖానలో రెస్టు రూము చెప్పారు. కానీ ఇప్పటివరకు రెస్ట్ రూము చూపించలేదు. ఆశాలను తోటి ఉద్యోగులు అనేది అధికారులు మర్చిపోతున్నారు. ప్రయాణ చార్జీలు ఇవ్వరు.వ్యాక్సిన్ డబ్బులు మోపియడం సరైనది కాదని ఆషాడే సందర్భంగా కనీసం మంచినీళ్లు స్నాక్ ఇవ్వరు వాష్ రూమ్ ఉండదు.
కుర్చీలు ఉండవు .. సర్వేలు చేయమంటారు ఫీవర్ సర్వేలు, కంటి వెలుగు, క్యాంపు టీబీ సర్వేలు అనేక రకాలుగా సర్వేలు చేయించుకొని డబ్బులు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 వెయ్యిలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం రిటర్మెంట్ బెనిఫిట్స్ఇన్సూరెన్స్ సౌకర్యం 50 లక్షలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలి. వరసత్వాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కారం చేయకుంటే రానున్న కాలంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుకన్య, రేణుక, సబితా, ఇందిరా , శైలజ, సుజాత, దివ్య, భాగ్య, తదితరులు పాల్గొన్నారు.