Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ సుభాషితలో తెలుగు భాషపై కార్యశాల

శ్రీ సుభాషితలో తెలుగు భాషపై కార్యశాల

- Advertisement -

నవతెలంగాణ –  ఆర్మూర్  : పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో 30 రోజులలో తెలుగు అనర్గళంగా చదవడం, రాయడంపై ప్రత్యేక శిక్షణ తరగతులు శనివారం ఏర్పాటు చేశారు. ఇందులో 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు నాలుగు రోజులపాటు పాల్గొంటారు. ఈ శిక్షణ శిబిరం ప్రముఖ చదువుల డాక్టర్ సంగరాజు భాస్కర్ రాజు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు తెలుగు అక్షరాల పరిచయం నుంచి ప్రారంభించి, పదాల నిర్మాణం, వాక్య నిర్మాణం, పఠన నైపుణ్యo, మంచి చేతి వ్రాత వంటి అంశాలపై దశలవారీగా వివరణ ఇస్తూ విద్యార్థుల చేత పలికించడం రాయించడం జరిగింది.

ఈ సందర్బంగా కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ..  తెలుగు భాషను ప్రాముఖ్యంగా తీసుకొని పిల్లలకు పఠన, లేఖన నైపుణ్యాలు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తులో భాష పట్ల గౌరవం పెరిగేలా చేయాలన్నదే మా లక్ష్యం అని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులకు తెలుగు సబ్జెక్ట్ అంటే భయం కలుగుతుంది, ఆ భయాన్ని పోగొట్టడానికి విద్యార్థుల కోసం 30 రోజులలో తెలుగులో అనర్గళంగా చదవడం, రాయడంపై ఏర్పాటు చేశాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -