Friday, October 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనిమ్స్‌లో ''వరల్డ్‌ అనస్థీషియా డే'' వేడుకలు

నిమ్స్‌లో ”వరల్డ్‌ అనస్థీషియా డే” వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిమ్స్‌లో ”వరల్డ్‌ అనస్థీషియా డే” వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అనస్థీషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎం. శ్రీలత గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలను నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప, డీన్‌ ప్రొఫెసర్‌ లిజా రాజశేఖర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు రోగి నొప్పుల నివారణలో అనస్థీషియాలజీ నిపుణుల అందిస్తున్న సేవలను వారు గుర్తుచేశారు. వివిధ అంశాలపై డాక్టర్‌ బ్రయాన్‌ జె. మారస్కల్చి, డాక్టర్‌ శ్రావణి దుర్భాకుల, డాక్టర్‌ సాయిరామ్‌ అట్లూరి, డాక్టర్‌ అక్షయ్ కుమార్‌ కర్‌, ప్రొఫెసర్‌ ఎం.శ్రీలతలు ప్రసంగించారు. ప్రాక్టికల్‌ సెషన్‌లో ఆరోగ్య సిబ్బందికి బేసిక్‌ ఎయిర్‌ వే మేనేజ్‌ మెంట్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చారు. క్విజ్‌తో పాటు వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌ వైద్యులు, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -