Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోటరీ క్లబ్ జేమ్స్ నవారి ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవం 

రోటరీ క్లబ్ జేమ్స్ నవారి ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ జేమ్స్ నిజాంబాద్ స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి పోలియో మార్చ్ నీకాలేజీ నుండి శివాజీ చౌక్ వరకు శుక్రవారం నిర్వహించడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు పాకాలనరసింహారావు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ తహసిల్దార్ విజయకాంత్ రావు పాల్గొని పోలియో మార్చిని జెండా ఊపి ప్రారంభిించారు. ఈ సందర్భంగాా వారు మాట్లాడుతూ.. 1955లో మొట్టమొదటి విజయవంతమైన పోలియో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన అమెరికన్ వైరాలోజిస్ట్ డాక్టర్ జోనస్ సాల్క్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 24 ను ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ పోలియో మహమ్మారిని మన దేశం నుండి పూర్తిగా పారదోలడానికి ప్రతి ఏడాది రెండు విడతలుగా పోలియో వ్యాక్సిన్ జీరో నుండి ఐదు సంవత్సరంల పిల్లల వరకు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.

కావున ప్రతి సంవత్సరం పోలియో వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ప్రజలు తప్పకుండా తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కోరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కాకతీయ రీజియన్ ట్రైనర్ రంజిత్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ..1988 వరకు పది లక్షల వరకు పోలియో వ్యాధి పడిన వారు ఉండేవారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వ్యాక్సిన్ క్రమం తప్పకుండా వాడడం వల్ల ఇప్పటివరకు 99.9% ఈ వ్యాధి తగ్గిపోయిందని, కేవలం 0.1% మాత్రమే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రమే ఉందని దాన్ని కూడా పూర్తిగా నిర్మూలించడానికి మా రోటరీ ఇంటర్నేషనల్ కంకణం కట్టుకుందని తెలియజేశారు.

మన భారతదేశంలో 2011 నుండి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా రికార్డు కాలేదు. కాబట్టి మన దేశం పోలియో రహిత దేశంగా అవతరించిందని డబ్ల్యూహెచ్వో చెప్పడం జరిగింది. ఈ పోలియో వ్యాధి ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించడానికి అయ్యే ఖర్చును పూర్తిగా రోటరీ ఇంటర్నేషనల్ మాత్రమే భరించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ ఆర్ టి ఎన్ గంజి రమేష్, సభ్యులు మరియు కళాశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షులు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -