నవతెలంగాణ – ఆర్మూర్
రోటరీ క్లబ్ అఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవం పురస్కరించుకొని రోటరీ క్లబ్ అధ్యక్షులు రాధాకిషన్ అధ్యక్షతన పట్టణంలోని బిసి మనుమడు బాలికల వసతి గృహం నందు బాలికలకు పోలియో చుక్కల గురించి అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ ఖాందేశ్ సత్యం మాట్లాడుతూ.. 0 నుండి 5 సంత్సరల పిల్లలకు పోలియో చుక్కలు పోలియోవైరస్ వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి నుండి పిల్లలను రక్షిస్తయని తెలిపారు. తులసి పాట్వరి మాట్లాడుతు పోలియో ఒకప్పుడు దేశం యొక్క పీడకల అని ఇది భారతదేశంలో వైకల్యానికి ప్రధాన కారణం అని అపోలో క్లినిక్‌లలోని ఓ పి విలు సురక్షితమైనవి వైరస్ నుండి దీర్ఘకాలిక రక్షణను కలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు రజనిష్ కిరాడ్, రాస ఆనంద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ పోలియో నివారణ దినోత్సవం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



