Magazines

డేటా సెంటర్లూ కారణమే!

1 రోజు క్రితం

Data centers
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

రిపబ్లికన్ల ఓటమిపై మీడియా సంస్థల విశ్లేషణ

వాషింగ్టన్ : కర్ణుడి చావుకు ఆరు కారణాలు అన్నట్లుగా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల పరాజయానికి అనేక కారణాలు కన్పిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో డేటా సెంటర్లు కూడా ప్రధాన పాత్ర పోషించాయని మధ్యంతర ఎన్నికల ఓటర్ల సర్వే చెబుతోంది. క త్రిమ మేధ (ఏఐ)కు సంబంధించిన మౌలిక సదుపాయాల నిర్మాణ రంగంలో వేగంగా సంభవిస్తున్న మార్పులపై ప్రజల వ్యతిరేకత ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసి ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అసోసియేటెడ్ ప్రెస్, పలు వార్తా సంస్థల కూటమి నిర్వహించిన సర్వే ప్రకారం... డేటా సెంటర్ల నిర్మాణం తమ ఓటింగ్ నిర్ణయంపై ప్రభావం చూపిందని 56 శాతం మంది తెలిపారు. తమ ప్రాంతంలో డేటా సెంటర్ల నిర్మాణాన్ని 76 శాతం మంది ఓటర్లు వ్యతి రేకించారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లకు ఓటు వేశామని చెప్పినవారిలో డేటా సెంటర్ల పై వ్యతిరేకత ఎక్కువగా కన్పించింది.

డేటా సెంటర్లను వ్యతిరేకించారు... డెమొక్రాట్లకు ఓటేశారు

డెమొక్రాట్లు గెలుచుకున్న మూడు సెనెట్ సీట్లలో... టెక్సాస్‌లో 595, ఒహాయోలో 258, అయోవాలో 117 డేటా సెంటర్లు ఉన్నాయి. దేశంలోని యాభై రాష్ట్రాల్లో సగటున ఒక్కో రాష్ట్రంలో 55 డేటా సెంటర్లు ఉండగా ఈ రాష్ట్రాల్లో వాటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఒక్క టెక్సాస్ రాష్ట్రంలోనే 31 డేటా సెంటర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఏ అమెరికా రాష్ట్రంలోనూ ఇన్ని సెంటర్లు నిర్మాణంలో లేవు. బీబీసీ విశ్లేషణ ప్రకారం డెమొక్రాట్ల వైపు మొగ్గు చూసిన రాష్ట్రాల్లో డేటా సెంటర్లపై వ్యతిరేకత అధికంగా ఉంది. డేటా సెంటర్లపై ఏదో ఒక రూపంలో కఠినమైన నియంత్రణలు అమలు చేయాలంటూ పిలుపునిచ్చిన డెమొక్రాట్లను టెక్సాస్, ఒహాయో, జార్జియా రాష్ట్రాలు గవర్నర్లుగా, సెనెటర్లుగా ఎన్నుకోవడం గమనార్హం.

ఏఐ భవిష్యత్‌పై ప్రభావం ఉంటుందా ?

ఎన్నికల ఫలితాలు ఏఐ విప్లవం భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలి ఏండ్లలో డేటా సెంటర్ల నిర్మాణంతో సహా ఏఐ కార్పొరేట్ సంస్థలు పెట్టిన భారీ పెట్టుబడులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిన వాట వాస్తవం. ఈ నేపథ్యంలో సెంటర్ల నిర్మాణాన్ని పూర్తిగా ఆపేయడం సాధ్యం కాకపోవచ్చునని, అయితే తాత్కాలిక నిషేధాలు విధించడం, నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు చేపట్టవచ్చునని నిపుణులు సూచించారు. స్థానికంగా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా నిర్మాణాల్లో జాప్యం జరిగే అవకాశం కూడా ఉంది.


పర్యావరణం, జీవన నాణ్యతకు హానికరం

ప్యూ రిసెర్చ్ సెంటర్ ఇటీవల 
నిర్వహించిన సర్వేలో కూడా దాదాపు సగం మంది అమెరికన్లు డేటా సెంటర్ల నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఇవి పర్యావరణానికి, గ హ ఇంధన ఖర్చులకు, జీవన నాణ్యతకు ‘చాలా చెడ్డవి’ అని వారు స్పష్టం చేశారు. జనవరితో పోలిస్తే డేటా సెంటర్లపై వ్యతిరేకత బాగా పెరిగింది. ఐదు సంవత్సరాల క్రితం వరకూ అమెరికన్ల ద ష్టిలో కూడా లేని అంశానికి ఇప్పుడు అసాధారణ ప్రాధాన్యత లభించిందని కాంగ్రెస్ ఓటర్ల పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్