Magazines

ఇజ్రాయిల్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై నేడు నిర్ణయం

3 గంటల క్రితం

formation
avatar
balaji

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

అన్ని పక్షాలతో అధ్యక్షుడు హెర్జోగ్ సంప్రదింపులు పూర్తి

టెల్ అవీవ్ : ఇజ్రాయిల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనే విష యంపై ఆదివారం నిర్ణయం తీసుకుంటానని అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ చెప్పారు. పార్లమెంటుకు ప్రతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల నేతలతో ఆయన సంప్రదింపులు పూర్తి చేసి వాటి అభిప్రాయాలను తెలుసుకు న్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎవరికి మద్దతు ఇచ్చేదీ ఆయా పార్టీల నేతలు ఆయనకు తెలియజేశారు. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నేతను గుర్తించిన అనంతరం అధ్యక్షుడు ఆయనను ఆహ్వానిస్తారు. సైనిక దళాల మాజీ అధిపతి గాడీ ఐసెన్‌కోట్ నేతృ త్వంలోని ప్రతిపక్ష కూటమికి అత్యధిక పార్టీలు మద్దతు తెలిపాయి. ముఖ్యంగా 19 స్థానాలు గెలుచుకున్న అరబ్ పార్టీలు ఆయనకే జై కొట్టాయి. దీంతో 120 మంది సభ్యులున్న ఇజ్రాయిల్ పార్లమెంటులో ఐసెన్‌కోట్‌కు మద్దతు ఇస్తున్న వారి సంఖ్య 67కు చేరింది. ఈ నేపథ్యంలో ఆయననే ప్రభుత్వ ఏర్పాటుకు హెర్జోగ్ ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఇదిలావుండగా ప్రధాని నెతన్యాహూకు దీర్ఘకాలంగా మిత్రపక్షంగా ఉన్న యునైటెడ్ తోరా జుడాయిజం ఆయనకు షాక్ ఇచ్చింది. ఎవరికి మద్దతు ఇచ్చేదీ వెల్లడించేందుకు నిరాకరించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్