Magazines

భారత ప్రజాస్వామ్యం పవిత్రమైనది

2 గంటల క్రితం

democracy
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

ఎన్నికలను బహిష్కరిస్తే 
అది అంతమవుతుంది: రాహుల్ గాంధీ

చికాగో: భారత ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోకుండా, ఎన్నికల్లో ఎదురయ్యే సవాళ్లను భరిస్తూ పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు పోటీకి దూరమైతే ప్రజాస్వామ్యానికి ముగింపు పలికినట్లేనని చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు వెళ్లిన రాహుల్‌ గాంధీ, అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మేరకు మాట్లాడారు.

"ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్నికలను బహిష్కరిస్తే భారత ప్రజాస్వామ్యం అంతమవుతుంది. కానీ, కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఉద్దేశం లేదు.

ప్రజాస్వామ్యంలో సమస్య ఉందని నేను చెప్పాలంటే నా దగ్గర 100, 200, 300 శాతం కచ్చితమైన ఆధారాలు ఉండాలి, లేకపోతే అలా మాట్లాడటం చాలా కష్టం. ఒకవేళ మేం మా పార్టీ కార్యకర్తలతో 'సరే, మీరు ఎన్నికల్లో పాల్గొనకండి' అని చెబితే ఏమవుతుంది? ఎన్నికల్లో మేం పోటీ చేయకూడదని నిర్ణయించుకుంటే, ఆ క్షణమే భారత ప్రజాస్వామ్యం అంతమైపోతుంది. కానీ, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అంతం చేయాలని మేం కోరుకోవడం లేదు. కాబట్టి, ప్రస్తుతం ఏం జరుగుతోందో ప్రజలకు వివరించడం, వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని భారత ప్రజలు గ్రహించే వరకు ఎదురయ్యే ఓటములను భరించడమే మా వ్యూహం." అని రాహుల్ చెప్పారు.

ప్రజాస్వామ్య హక్కులను మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తోంది: జైరాం రమేశ్

ప్రధాని మోడీ ప్రభుత్వం పౌరుల ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీస్తోందని, ప్రజల పట్ల జవాబుదారీతనాన్ని బలహీనపరుస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ల శాఖ ఇన్‌చార్జి జైరాం రమేశ్ గురువారం ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దును 'ఓటుబందీ'గా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, గురువారం ఎక్స్పోస్టులో పేర్కొన్నారు. "మొదట, పెద్ద నోట్ల రద్దు సామాన్యుల ఉద్యోగాలను దెబ్బతీశాయి. ఇప్పుడు ఓటుబందీ వారి ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేసింది. పెద్ద నోట్ల రద్దు, ఓటుబందీ రెండూ ఒకే నాణేనికి రెండు వైపులాంటివి. అప్పట్లో అధికారంలో ఉన్నవారి అహంకారం ప్రజల సంపాదనను, జీవనోపాధిని దెబ్బతీసింది. ఇప్పుడు అది వారి ఓట్లను, గొంతును దెబ్బతీస్తోంది." అని రమేశ్ వివరించారు.

అతిపెద్ద ఆయుధం వారి ఓటు మాత్రమే!

అప్పట్లో అధికారంలో ఉన్నవారు ప్రజల సంపాదనను, జీవనోపాధులను దెబ్బతీసిందని, కానీ ఇప్పుడు ఓట్లను, వారి గొంతుకను దెబ్బతీస్తోందని జైరాం రమేశ్ ఆరోపించారు. "ఓట్ల దొంగతనం అనేది కేవలం ఎన్నికల అక్రమాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది ప్రధానమంత్రి, హోం మంత్రి కుమ్మక్కుతో ప్రజల హక్కులపై, వారి గొంతుకపై జరుగుతున్న అతిపెద్ద దాడి. ప్రజాస్వామ్యంలో, పేదలు, కార్మికులు, రైతులు, అణగారిన, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, యువత, మధ్యతరగతి ఇలా ఎంతోమంది ప్రజలు తమ గొంతుకను వినిపించడానికి ఉన్న అతిపెద్ద ఆయుధం వారి ఓటు. కాబట్టి, దాని ద్వారానే ప్రభుత్వాలు ప్రజల మాట వినేలా, తమ సమస్యల గురించి పట్టించుకునేలా, ఎన్నికల సమయంలో ఆ పర్యవసానాలను ఎదుర్కొనేలా చేస్తుంది" అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్