Magazines

ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచే ద్దాం

1 గంట క్రితం

peace
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 3 నిమిషాల చదవడం

ఆ బాధ్యత మనపై ఉంది : జిన్‌పింగ్, పుతిన్, ట్రంప్

షెన్‌జెన్ : ప్రపంచ శాంతి, భద్రత కోసం కలిసి పనిచేద్దామని, ఆ బాధ్యత మనపై ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. గురువారం త్రైపాక్షిక సమావేశంలో . ఈ త్రైపాక్షిక భేటీని ఒక మైలురాయి ఘట్టంగా అభివర్ణించారు షీ జిన్‌పింగ్. మూడు దేశాల మధ్య సహకారం కోసం ఆయన రెండో ప్రపంచ యుద్ధం నాటి కూటమిని ప్రస్తావించారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో చైనా, రష్యా, అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, స్థిరత్వాలను ఉమ్మడిగా కాపాడుతూ మానవ పురోగతికి మరింత కృషి చేయాలని కోరారు. ప్రపంచ శాంతి, భద్రత కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ప్రధాన శక్తులపై (రష్యా, చైనా, అమెరికానుద్దేశించి) ఉందన్నారు. ఎనిమిది దశాబ్దాల క్రితం మూడు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి చరిత్రను ప్రస్తావించారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. 80 సంవత్సరాల క్రితం ఫాసిస్టు వ్యతిరేక కూటమికి మద్దతుగా మన మూడు దేశాలు కలిసి పోరాడి గొప్ప విజయాన్ని సాధించాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో శాంతిని కాపాడాయని వివరించారు. ఈ చారిత్రక జ్ఞాపకాలను మూడు దేశాలు కాపాడుకోవాలని, గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

ఆ అంశాలపై చర్చలు కొనసాగించాలి : ట్రంప్ పిలుపు

ప్రపంచ సవాళ్లపై చర్చల మార్గాలను తెరిచి ఉంచాల్సిన ప్రత్యేక బాధ్యత ప్రపంచంలోని ప్రధాన శక్తులపై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా, చైనా, రష్యా నాయకుల మధ్య జరిగిన ఈ మొట్టమొదటి త్రైపాక్షిక సమావేశాన్ని దౌత్యపరమైన ఏకాకితనం నుంచి వైదొలగడానికి అవసరమైన మార్పుగా అభివర్ణించారు. ప్రపంచంలోని మూడు అతిపెద్ద దేశాల అధ్యక్షులుగా కేవలం మన ప్రజలపైనే కాకుండా, యావత్ భూగోళంపై ప్రభావం చూపే అంశాలపై గౌరవప్రదమైన చర్చలను కొనసాగించాల్సిన ప్రత్యేక బాధ్యత మనపై ఉందన్నారు. "గతంలో నాయకులు తరచుగా తమతో విభేదాలు ఉన్న దేశాలతో చర్చలు జరిపేవారు కాదు. ప్రత్యర్థులతో చర్చలకు నిరాకరించడం వల్ల ఏ సమస్య పరిష్కారం కాలేదు.

ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రత్యక్ష చర్చలు అత్యవసరం. పరస్పర చర్చలు, సంభాషణల అవకాశాలను తిరస్కరించడం ద్వారా ఎప్పుడూ శాంతి నెలకొనలేదు. ఈ సమావేశంలో అణ్వాయుధాల నిరాయుధీకరణ చర్చించాం. అయితే దేశాలను తమ అణ్వాయుధాలను వదులుకునేలా ఒప్పించడంలో చాలా అడ్డంకులు ఉన్నాయి. ఒకసారి అణ్వాయుధాలను కలిగి ఉన్న తర్వాత వాటిని వదులుకోవడం చాలా కష్టం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఒక ఒప్పందం దిశగా సానుకూల కదలికలు మొదలయ్యాయి. రష్యా, ఉక్రెయిన్ కూడా యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను" అని ట్రంప్ పేర్కొన్నారు.

'సురక్షితమైన ప్రపంచం కోసం కృషి చేస్తున్నాం'

గత దౌత్య విధానాలకు భిన్నంగా ఈ త్రైపాక్షిక సమావేశం జరుగుతోందని ట్రంప్ పేర్కొన్నారు. జిన్‌పింగ్, పుతిన్‌లతో కలిసి మరింత సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు ఒక కొత్త మార్గాన్ని అన్వేషించడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో అణు వ్యాప్తి ముప్పును ఎదుర్కోవడానికి మూడు దేశాలు కలిసికట్టుగా పనిచేయడం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండనివ్వబోమని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి పుతిన్‌తో ఇప్పటికే సుదీర్ఘ ద్వైపాక్షిక చర్చలు జరిపినట్లు స్పష్టం చేశారు. జాతీయ సార్వభౌమాధి కారాన్ని కాపాడుకోవడానికి ఉమ్మడి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) నియంత్రణ లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఎదుర్కోవడానికి ఈ మూడు అగ్రరాజ్యాలు కలిసి పనిచేయాలని కోరారు.


పుతిన్ ఏమన్నారంటే?

ఆర్థిక సంబంధాలు, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో మూడు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం సహా ఇతర ప్రాంతీయ వివాదాలను పరిష్కరిం చడంలో ఈ మూడు దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. మాస్కో, బీజింగ్, వాషింగ్టన్ మధ్య పరస్పర గౌరవం, సమతుల్య ప్రయోజనాలతో కూడిన నిర్మాణాత్మక సహకారం ప్రపంచ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం, సరిహద్దులు దాటిన వ్యవస్థీకృత నేరాలు వంటి నేటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఉమ్మడి ఆసక్తి ఉందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్