Magazines

ఎనిమిది కెనడా సంస్థలపై అమెరికా ఆంక్ష‍లు

3 గంటల క్రితం

entities
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : ఇరాన్‌ సంస్థలు ఆర్థిక ఆంక్ష‍లను తప్పించుకోవడానికి సహాయం చేశారని ఆరోపిస్తూ కెనడాపై సంస్థలపై అమెరికా ఆంక్ష‍లు విధించింది. ‘‘ఆపరేషన్‌ ఎకనామిక్‌ అవుట్‌కాస్ట్‌’’ పేరుతో కెనడాకు చెందిన ఎనిమిది నగదు మార్పిడి సంస్థలపై ఆంక్ష‍లు విధించనున్నట్లు అమెరికా ట్రెజరీ విభాగం శుక్రవారం ప్రకటించింది. కొన్ని వ్యాపార సంస్థలు ఇరాన్ రియాల్స్, ఇతర కరెన్సీలను క్రిప్టోకరెన్సీ వంటి డిజిటల్ ఆస్తులుగా మార్చడం ద్వారా తమ లాభాలను అక్రమంగా తరలించాయని తెలిపింది. అలాగే కొన్ని వ్యాపార సంస్థలు డ్రగ్స్‌ స్మగ్లింగ్ ముఠాకు చెందిన ఒక నిందితుడికి సహాయం చేశాయని వెల్లడించింది. ఇరాన్‌ ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలు అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరించే అక్రమ ఆర్థిక మధ్యవర్తులకు కెనడా ఆశ్రయం కల్పించకూడదని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ స్పష్టం చేశారు.


ఈ సంస్థలు అంటారియో, బ్రిటిష్‌ కొలంబియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వాటిలో మిలియన్‌ ఎక్స్ఛేంజ్‌, అమీన్‌ ఎక్స్ఛేంజ్‌, క్రిప్టోయల్‌ ఉన్నాయని అమెరికా ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ఆంక్షలు ఆ సంస్థలను అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి సమర్థవంతంగా వేరు చేశాయని, అమెరికాలో వారి ఆస్తులను స్తసంభింపచేయడమే కాకుండా, అమెరికన్ ప్రజలు, సంస్థలతో లావాదేవీలు జరపకుండా వాటిని నిషేధించాయి.అమెరికా ఇరాన్‌కు ఆర్థికంగా సహకరిస్తున్నాయని పేర్కొన్న కొన్ని సంస్థలపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో, కెనడా కూడా అమెరికా ఫిన్‌సెన్‌తో కలిసి పనిచేసినట్లు ఫిన్‌ట్రాక్‌ వెల్లడించింది. మనీలాండరింగ్‌, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, అంతర్జాతీయ ఆంక్షల ఎగవేత వంటి కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఇతర దేశాల ఆర్థిక నిఘా సంస్థలతోనూ సమాచారాన్ని పంచుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇరాన్‌ ప్రభుత్వానికి, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జిసి)కి ఆర్థిక సహాయాన్ని అడ్డుకోవడమే ఆంక్ష‍ల లక్ష్యమని అమెరికా ఆర్థిక శాఖ వెల్లడించింది. ఐఆర్‌జిసిని కెనడా కూడా ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్లు పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్