Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభోజనంలో పురుగులు

భోజనంలో పురుగులు

- Advertisement -

– టీయూలో విద్యార్థుల ఆందోళన
నవతెలంగాణ-డిచ్‌పల్లి

తెలంగాణ యూనివర్సిటీలోని పీజీ న్యూ బార్సు హాస్టల్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రి భోజనంలో పురుగు రావడంతో అధికారుల పర్యవేక్షణ లోపాన్ని నిరసిస్తూ మంగళవారం యూనివర్సిటీలోని హాస్టల్‌ వద్ద ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న చీఫ్‌ వార్డెన్‌ విద్యార్థుల వద్దకొచ్చి మాట్లాడారు. విద్యార్థులు యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ రావాల్సిందేనని భీష్మించుకూర్చున్నారు. అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నా పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ యం.యాదగిరి అక్కడికి చేరుకుని వసతి గృహంలోని కిచెన్‌లో కలియతిరిగి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి హామీనిచ్చారు. వైస్‌ ఛాన్స్‌లర్‌ అందుబాటులో లేని కారణంగా ఆయన దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. సమస్యలు పరిష్కరించకుంటే విద్యార్థులంతా కలిసి రోడ్డెక్కుతామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -