నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిరిసిల్ల ఆర్ డి ఓ వెంకటేశ్వర్లు కు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, అందరికి కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెల వేతనాలు చెల్లించాలని, రైతు వ్యతిరేక విధానాలు ఉపసంహారించుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని తెలిపారు.
ఉపాది హామీని పట్టణాలకు విస్తరించి, సంవత్సరo లో 200 రోజుల పని దినాలు కల్పిస్తూ రోజుకు రూ.600 ఇవ్వాలని, పవర్ లూం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జి వో ప్రకారం 10గంటల పని వారంలో 48 గంటలు కల్పిస్తూ నైట్ డ్యూటీ రద్దు చేయాలని, వర్క్ టూ ఓనర్ పథకం వెంటనే అమలు చేయాలని, త్రిఫ్ట్ స్కీమ్ అమలు చేయాలని, 50 సంవత్సరాల కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సైతం 55 సంవత్సరాలు నిండిన వారికి 5వేల పెన్షన్ ఇవ్వాలని, అంగన్వాడి లను రెగ్యులరైజ్ చేయాలని, సివిల్ సప్లై కార్మికులను 4 వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
హమాలి కార్మికులకు పని భద్రత, దేవస్థానం, మిషన్ భగీరథ వారిని రెగ్యులరైజ్ చేయాలని, ఆటో కార్మికులకు ప్రభుత్వం చెప్పిన విదంగా జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని తదితర విజ్ఞాపణలు చేశారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, పోచయ్య, వడ్డెపెల్లి లక్ష్మన్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ, జువ్వాజీ విమల, ఐ ఎఫ్ టి యు నాయకులు ఆకుల రాములు,ఏఐటీసీయూ రాష్ట్ర నాయకులు సోమిశెట్టి దశరధం నాయకులు పాల్గొన్నారు.



