- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అడ్వాలపల్లి, తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, కొయ్యుర్ తదితర గ్రామాల్లోని మంగళవారం గణపతి మండపాల్లోమహిళలు సామూహిక కుంకుమార్చన పూజలు, మండపాల్లో మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అడ్వాలపల్లిలో గణపతి మండపం వద్ద తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప స్వరూప-మొండయ్య దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మండల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐష్టఐశ్వర్యాలతో జీవించాలని వారు కోరుకున్నట్లు తెలిపారు.
- Advertisement -