మార్పు మొదలైందంటే
మంచి ఘడియలు
వస్తున్నయనుకుంటిమి..!
అర్ధాంతరంగా రాలిపోతున్న
మట్టిపూల ఆత్మహత్యల వెనుక
ఎంత కన్నీటి సంద్రపు
విస్పోటనముందో…!
ప్రతీసారి యూరియా కప్
జీవిత పరుగు పందెంలో
ఎవుసం మైదానంలో
ఓడిపోతూనే వున్నాడు..!
కొన ఊపిరితో మళ్లీ …
కొత్త చిగురాశతో వెళ్లీ…
యుద్ధం చేస్తూనే వున్నాడు
అలసిపోతున్న గుండెసాక్షిగా..!
మేఘాలు జాలి చూపక
ప్రభుత్వాలు దారి వేయక
ప్రకృతి పరిహాసం ప్రభుత్వ నిర్లక్ష్యం
కర్ణుని చావుకు వంద కారణాల లెక్క..!
అప్పుల ఊబిలో
మన రైతన్న గుండె జ్వాలలు..!
కర్షకుని కన్నీటి అలల మధ్య
ఎన్నో ప్రభుత్వాల మార్పు
తలరాతలే మారాయి..!
రైతుబంధు, రుణమాఫీలు
రాజకీయ రంగులు
పులుముకున్నాక…
రాబడి ధరలు పొందలేక
తెలం”గానం”మారిపోతుంది..!
చనిపోయిన రైతుల తనువుల్ని
మోస్తున్న పాడెలు…
రైతు జీవన గేయాల
గాయాల ఖాతాలను
పాడటం మొదలెట్టాయి!
కన్నీటి ధారలుగా..!!
- పి.అరుణ్ కుమార్,
9394749536