- Advertisement -
వృద్ధులను అభ్యర్థించిన సీపీఐ(ఎం) అభ్యర్ధి కృష్ణయ్య
నవతెలంగాణ – మిర్యాలగూడ
అవ్వా.. మీ ఓటు నాకే వెయ్యాలి అని బీఆర్ఎస్ మద్దతతో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థి బొగ్గరపు కృష్ణయ్య గడ్డం పట్టుకొని వృద్ధులను వేడుకున్నారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామంలో కృష్ణయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు గ్రామ ఓటర్లు కలిసి ఓటు వేయాలని అభ్యర్ధించారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో టాప్రా సంఘం జిల్లా అధ్యక్షులు జగదీష్ చంద్ర రెడ్డి, జొన్నలగడ్డ రంగా రెడ్డి, బిఆర్ఎస్, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



