నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో మొబైల్ ఫోన్లకు సిగ్నల్ రాక పోవడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు, వినియోగదారులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. స్థానిక చించాల -ఎడ్ బిడ్ రోడ్డుపై కొంతసేపు ఆందోళన చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎయిర్ టెల్, జియో, ఐడియా, బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఫోన్లకు నెట్వర్క్ రాకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని వినియోగదారులు తెలిపారు. వందలాదిమంది వినియోగదారులు డబ్బులు పెట్టి మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పటికీ నెట్వర్క్ రాకపోవడంతో నష్టపోతున్నామని వారు పేర్కొన్నారు. తక్షణమే ఆయా కంపెనీ వారు స్పందించి నెట్వర్క్ సమస్యను తీర్చాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ దొడ్డి కింది సర్వేష్, ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్, యూత్ సభ్యులు, గ్రామస్తులు, వినియోగదారులు, పాల్గొన్నారు.
చించాలలో మొబైల్ సిగ్నల్ కొరకు రాస్తారోకో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



