Sunday, February 1, 2026
E-PAPER
Homeఖమ్మంఖమ్మం బస్టాండ్ లో రెండు గంటల పాటు రాస్తారోకో

ఖమ్మం బస్టాండ్ లో రెండు గంటల పాటు రాస్తారోకో

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్ 
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు రావాలని నోటీస్ ఇవ్వటం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బోనకల్ మండల కమిటీ స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ ఆ పార్టీ ఇన్చార్జి లింగాల కమల్ రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పై ఘాటైన విమర్శల వర్షం కురిపించారు. దేశాన్ని రాష్ట్రాన్ని ఐదు దేశాల పాటు కాంగ్రెస్ దోసుకుందని విమర్శించారు. కెసిఆర్ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఎంతో అభివృద్ధి చేశారన్నారు.

అటువంటి ముఖ్యమంత్రికి అక్రమ కేసు బనాయించాలని ఉద్దేశంతో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో సిట్ నోటీసులు ఇవ్వటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా కేసిఆర్ కు సీట్ విచారణ చేపట్టిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండగ కాదు పండుగ అని కెసిఆర్ తన పరిపాలన కాలంలో నిరూపించారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని ఆదర్శవంత రాష్ట్రం గా తీర్చిదిద్దారన్నారు. అనేక అవినీతి అక్రమాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కూరుకుపోయిందని విమర్శించారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతోనే ఇటువంటి పన్నాగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. అవినీతి నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ పేరుతో కెసిఆర్ కి నోటీసులు ఇచ్చారని విమర్శించారు.

మధిర ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఇటీవల వరకు కమిషనర్ల మంత్రి అన్నారని, కానీ అంతకంటే పెద్ద అవినీతి ఊబిలో కూరుకుపోయారని విమర్శించారు. నైని బొగ్గు గనుల కుంభకోణంలో మల్లు భట్టి విక్రమార్క పీకల లోతు కూరుకుపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి నుంచి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు దందా మంత్రులుగా ప్రసిద్ధి చెందారని విమర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓ చోట ఉంచిన దిష్టిబొమ్మను తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా ఎస్సై పొదిలి వెంకన్న సిబ్బంది అడ్డుకున్నారు.

దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పార్టీ కార్యకర్తల నుంచి పోలీసులు బలవంతంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను లాక్కొని వెళ్లారు. చివరకు దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బంధం నాగేశ్వరరావు, తెల్లబోయిన నాగేశ్వరరావు, కొమ్మినేని ఉపేందర్, బోయినపల్లి వెంకటేశ్వర్లు, మోదుగుల నాగేశ్వరరావు, నిమ్మ తోట రవి, తేల్లూరి రమేష్, ముక్కపాటి అప్పారావు, రెడ్డిబోయిన ఉద్దండు, జెర్రిపోతుల రవీంద్ర, బెజవాడ మల్లికార్జునరావు, కొనకంచి నాగరాజు, గొల్లమందల రాజారావు తదితరులు పాల్గొన్నారు.

filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;
hdrForward: 6; shaking: 0.123765; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 8;
brp_del_th: 0.0130,0.0000;
brp_del_sen: 0.1500,0.0000;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 42;
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -