Saturday, July 12, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రజాపాలన దరఖాస్తు దారులకు తప్పని తిప్పలు

ప్రజాపాలన దరఖాస్తు దారులకు తప్పని తిప్పలు

- Advertisement -

సమయానికి రాని అధికారులు 
ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ అధికారుల తీరు
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం 

సందీప్ :
సార్ ఉచిత కరెంటు వస్తలేదు అప్డేట్ చేయాలి. 
కార్యాలయ సిబ్బంది : సారు రాలేదు.. ఫీల్డ్ కి వెళ్ళిండు. వచ్చేవరకు ఆగుండ్రి
బాల్ రెడ్డి : సార్ కరెంటు బిల్లు అప్డేట్ చేయాలి. 
కార్యాలయ సిబ్బంది : సారు రాలేదు వచ్చేవరకు ఆగుండ్రి. 
బాల్ రెడ్డి : శనివారం కూడా వచ్చిన సాయంత్రం వరకు ఆగమన్నారు పని కాలే ఈ ఆలోచన మళ్ళీ ఆగమంటుర్రు ఎన్ని రోజులు తిరగాలి సార్. 
కార్యాలయ సిబ్బంది : మీ ఇష్టం ఉంటే ఉండుండ్రి.. పోతే పోండి సారు రాలేదు..

       ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న తీరు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమం పేరుతో ఉచిత విద్యుత్తు,  రూ.500 కే గ్యాస్ కలెక్షన్ తో పాటు అనేక సంక్షేమ పథకాల కోసం గ్రామసభల ద్వారా దరఖాస్తుల స్వీకరించింది. అయితే ఇంకా ఉచిత విద్యుత్తు, గ్యాస్ సబ్సిడీ కోసం ఆన్ లైన్లో అప్డేట్ చేసుకునేందుకు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారులను నియమించి దరఖాస్తులను స్వీకరిస్తుంది. వచ్చిన లభ్యదారులు కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లుతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

అయితే ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో గత వారం రోజులుగా అధికారులు అందుబాటులో ఉండకపోవడం వల్ల లబ్ధిదారులు తిరిగిపోతున్నారు. ఉదయం నుంచి వేచి చూసి వెను తిరుగుతున్నారు. సోమవారం ఉదయం 11:30 గంటలు కావస్తున్నా.. అధికారులు అందుబాటులో లేరు. వారి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఉచిత విద్యుత్ కోసం కరెంట్ బిల్లును అప్డేట్ చేసుకునేందుకు వచ్చిన వారికి ఎంపీడీవో రాలేదనీ, వచ్చేవరకు ఆగాలని కార్యాలయ సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. పోచారం గ్రామానికి చెందిన బాల్ రెడ్డి అనే లబ్ధిదారుడు గత శనివారం కూడా తన కరెంటు బిల్లును అప్డేట్ చేసుకునేందుకు వచ్చాడు. ఆరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసి పని కాకపోవడంతో వెనుతిరిగాడు.

సోమవారం ఉదయం ప్రజా దర్బారు ఉన్న నేపథ్యంలో మళ్లీ ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు వేచి చూసి అధికారులను కలిస్తే చేస్తే ఎంపీడీవో రాలేదని ఆయన వచ్చేవరకు వెయిట్ చేయాలని సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఇంకా ఎన్నిరోజులు తిరగాలి. వారం రోజుల నుండి తిరిగిపోతున్నా.. ఫలితం లేకుండా పోతుందని “నవతెలంగాణ” తో బాల్ రెడ్డి అనే లబ్ధిదారుడు ఆందోళన వెలిబుచ్చారు. తను ఎలక్ట్రిషన్ పని చేస్తానని, పని చేస్తేనే కుటుంబం గడుస్తుందని వాపోయాడు. వారం రోజులుగా మండల కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారే తప్ప, కరెంట్ బిల్లు అప్డేట్ చేయడం లేదని ఆందోళన వెలిబుచ్చారు.  తనకు భూములు, ఆస్తులు, అంతస్తులు అంతకన్నా లేవని, రోజు పని చేసుకుంటూనే కుటుంబ జీవనం సాగుతుందని చెప్పుకొచ్చారు. అధికారులు తిప్పించుకుంటున్నారని తమ పని మాత్రం చేయడం లేదని వాపోయారు.

ఇదిలా ఉంటే గత వారం రోజులుగా ఇంటర్నెట్ బిల్లు పే చేయకపోవడంతో సర్వర్ పని చేయడం లేదు. ఆ విషయం లబ్ధిదారులు చెప్పకుండా సారు రాలేదని, సర్వర్ పని చేయడం లేదని, సార్ రాలేదని, ఆగాలని పొంతనలేని సమాధానం చెబుతూ లబ్ధిదారులను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఇంకెన్ని రోజులు తిప్పించుకుంటారని లబ్ధిదారులు అధికారులపై అగ్ర వ్యక్తం చేయడంతో అప్పటికప్పుడు సీనియర్ అసిస్టెంట్ నెట్ బ్యాలెన్స్ వేసి వారి పని చేసి పంపించారు. ఇది ఎంపీడీవో కార్యాలయంలో పేద ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీర్పు నిదర్శనం. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయ అధికారుల తీరుపై జిల్లా పరిషత్ అధికారులు దృష్టి కేంద్రీకరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల పట్ల నిర్లక్ష్య ధోరణికి ఓవరిస్తున్నారని మండిపడుతున్నారు. కనీస సమాచారం ఇవ్వకపోగా తమ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -