- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని ప్రాథమిక పాఠశాల తొర్లికొండ నందు జడ్.పి.హెచ్.ఎస్ తొర్లికొండలో విద్యనభ్యసించిన SSC 1994 – 95 బ్యాచ్ మిత్ర బృందం మా పాఠశాలకు జిరాక్స్ కం ప్రింటర్ మిషన్ వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి హాజరైనారు. SSC 1994 – 95 మిత్ర బృందానికి మండల పక్షాన మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఇలాగే ప్రభుత్వ పాఠశాలలకు ఎల్లప్పుడు మీ సహాయసహకారాలు ఉండాలని ఆశిస్తున్నానని తెలియజేశారు .
- Advertisement -