Thursday, February 5, 2026
E-PAPER
Homeజాతీయంమణిపూర్‌ ముఖ్యమంత్రిగా వై.ఖేమ్‌చంద్‌ ప్రమాణం

మణిపూర్‌ ముఖ్యమంత్రిగా వై.ఖేమ్‌చంద్‌ ప్రమాణం

- Advertisement -

రాష్ట్రపతి పాలన రద్దు

ఇంఫాల్‌ : బీజేపీ నేత వై.ఖేమ్‌చంద్‌ సింగ్‌ బుధవారం ఇంఫాల్‌లోని లోక్‌భవన్‌లో మణిపూర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బీజేపీకి చెందిన ఇద్దరు, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు మొత్తంగా నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేశారు. గతేడాది ఫిబ్రవరి నుంచి మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లో వుంది.
కొత్త మంత్రిమండలి ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతి స్థాపన జరుగుతుందని, ఇకపై శాంతి, అభివృద్ధిలే కొత్త ప్రభుత్వ మార్గదర్శకాలుగా వుంటాయని ఖేమ్‌చంద్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.

దీర్ఘకాలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అయిన ఖేమ్‌చంద్‌కు టెక్వాండోలో బ్లాక్‌బెల్ట్‌ వుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై 2012 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేశారు. కానీ కాంగ్రెస్‌ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఏడాది ఆయన బీజేపీలో చేరారు. ఘర్షణలు, అశాంతి నెలకొన్న మణిపూర్‌లో నాయకత్వ మార్పు కావాలంటూ పాలక బీజేపీలోనే డిమాండ్లు తలెత్తిన నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ గతేడాది ఫిబ్రవరి 9న తన పదవికి రాజీనామా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -