Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన వై.ప్రసాద్

నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన వై.ప్రసాద్

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గాశుక్రవారం వై.ప్రసాద్ భాధ్యతలు స్వీకరించారు.ఈయన త్రిపురారం ఎస్ఐ గా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా పెద్దవూర ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ ఐ వీరబాబు నల్గొండ ఎస్పీ ఆఫీస్ వీఆర్ బదిలీ చేశారుఈ సందర్భంగా నూతన ఎస్ఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. నిషేధిత గుట్కా, గంజాయి విక్రయాల అరితామని, దానితో పాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈ వ్ టీజింగ్, పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఆపద సమయంలో డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసుల సహాయాన్ని పొందాలని ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఎస్ఐ తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -