నవతెలంగాణ – ఆలేరు
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్టలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపే లక్ష్యంగా సిపిఐ, కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. సిపిఐ, కాంగ్రెస్ నాయకులు పొత్తు కోసం ప్రయత్నం చేస్తుండగా..బిఆర్ఎస్, బిజెపి లు కొన్ని సీట్లలో లోపాయికారిగా సర్దుబాటు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. గుట్టలో జనరల్ మహిళ రిజర్వేషన్ అయ్యింది. చైర్మన్ పదవిని అధికార ప్రతిపక్ష పార్టీ లు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కైవసం చేసుకునేందుకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలు కౌన్సిలర్ గా ఏ వార్డులో ఎవరిని పెడితే గెలుస్తారని తమ అంతరంగిక మిత్రుల ద్వారా చర్చించుకున్నట్లు తెలిసింది.
1 వార్డు లో కాంగ్రెస్ పార్టీ నుండి గౌలి కార్ అరుణ రాజేష్.2 వార్డులో బూడిద మధు. బుగ్గ ఆంజనేయులు. 3 వార్డులో బరిగ రామచందర్ 4 సీస విజయలక్ష్మి కృష్ణ,బుగ్గ ఆంజనేయులు 5వార్డులో బిట్టు సరోజ, హరీష్ 6 వార్డులో గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ 7 వార్డులో పెనిమిల్లి శ్రీధర్ సతీమణి,. ఎరుకల సుధా హేమేందర్ 8 వార్డులో కాంగ్రెస్ సిపిఐ పొత్తుతో పేరబోయిన మహేందర్ లేదా ముక్కెర్ల వెంకటేష్ 9 వార్డ్ సాధునేని మధుకర్ సతీమణి పదవ వార్డ్ వంగపల్లి అరుణ్ 11 వార్డ్ ముక్కెర్ల మల్లేష్ సయ్యద్ సలీం 12 వార్డ్ సిపిఐ కాంగ్రెస్ పొత్తులో భాగంగా బబ్బురి శ్రీధర్. తో పాటు మరో ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు చూస్తున్నట్లు సమాచారం.
బి ఆర్ ఎస్ పార్టీ టికెట్ పై పోటీ చేసేందుకు 1 వార్డ్ గొర్ల పద్మ 2 వార్డ్ పపట్ల నరహరి 3 వార్డ్ 4 వార్డ్…….?.5 వార్డు నాగేందర్ నాయక్ 6 వార్డు……? 7 వార్డు ఆర్ శ్రీధర్ భార్య. 8 వార్డు తీరబోయిన సత్యనారాయణ 9 వార్డ్ దండిపోయిన లాస్య అనిల్ 10 వా వార్డ్ ఆవుల మమత సాయి 11 వార్డ్ బాలకిషన్ 12.. …. ? తోపాటు ఆరే శివ గౌడ్ ముక్కెర్ల సతీష్ మాధవి టికెట్లు ఆశిస్తున్నట్లు తెలిసింది. బిజెపి మూడు లేదా నాలుగు సీట్లలో పోటీ చేస్తున్నట్లు సమాచారం బిఆర్ఎస్ నుండి పోటీకి 4. 6 12 వార్డులలో ఎవరయింది తెలియ రాలేదు.



