- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం అదిలాబాద్ జరిగిన జోనల్ స్థాయి స్విమ్మింగ్ పోటీలలో (అండర్ -14 ఇయర్స్ ) 50మీటర్లు బటర్ ఫ్లై విభాగంలో మండలంలోని ఇంధన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి చదువుతున్న K.రేవంత్ రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.రాజేందర్, ఫిజికల్ డైరెక్టర్ శివనూరి తిరుపతి తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ .. త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే స్విమ్మింగ్ పోటీలలో పాల్గొంటారని వెల్లడించారు. విద్యార్థి రాష్ర్టా స్థాయికి ఎంపిక పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు.
- Advertisement -