– ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దాం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
– కార్మిక పక్షపాతి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎం.సాయిబాబా
– సీఎం రేవంత్‌రెడ్డి ఊసరవెల్లి : రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
– యర్రా నిరంతరం పోరాటయోధుడు : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
– ఖమ్మంలో శ్రీకాంత్ వర్థంతి సభ
నవతెలంగాణ-గాంధీ చౌక్
పార్టీ తనకు అప్పగించిన పనిని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పూర్తి చేసే వరకూ విశ్రమించని మార్క్సిస్టు యర్రా శ్రీకాంత్ అని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. యర్రా శ్రీకాంత్ వర్థంతి సభ సోమవారం ఖమ్మంలోని బోస్ బొమ్మ సెంటర్‌లో పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రం అధ్యక్షతన జరిగింది. ముందుగా మార్కెట్ నుంచి బోస్ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ.. గతంలో త్రీ టౌన్ ప్రాంతం నుంచి మార్కెట్ తరలిపోకుండా ఇక్కడే ఉండేలా పోరాడి విజయం సాధించిన వ్యక్తి శ్రీకాంత్ అని గుర్తు చేశారు. తాను జిల్లా కార్యదర్శిగా పని చేసిన కాలంలో శ్రీకాంత్ పోరాట పటిమను దగ్గరుండి చూశానన్నారు. ఖమ్మం నగరంలో పార్టీ ఆదేశాల మేరకు జరిగిన ఇండ్ల స్థలాల పోరాటంలో శ్రీకాంత్ ముందుండే వారని తెలిపారు. కార్మిక రంగం బలోపేతం కోసం ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పలేమన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ,పాదయాత్ర, నిరాహార దీక్షతోపాటు జైలు జీవితం కూడా గడిపిన పోరాట యోధుడు అని కొనియాడారు. నేడు జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దురాక్రమణ దాడులు కొనసాగిస్తున్నాయని, చమురుపై ఆధిపత్యం కోసమే యుద్ధం చేస్తున్నవని అన్నారు. వందలాది మంది ప్రజల ప్రాణాలను బలి తీస్తున్నారని, ట్రంప్ ఆదేశాలకు కీలుబొమ్మగా భారతదేశ ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోడీ తప్పుడు విధానాల ఫలితంగా దేశం ఆర్థికంగా సంక్షోభంలోకి పోతుందని అన్నారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతు న్నారని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గ పోరాటంలో భాగస్వామ్యం కావటమే యర్రా శ్రీకాంత్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. జాతీయ కమిటీ సభ్యులు ఎం.సాయిబాబా మాట్లాడుతూ.. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి కార్మిక పక్షపాతిగా చివరి వరకు నిలిచిన వ్యక్తి శ్రీకాంత్ అని అన్నారు. ఖమ్మంలో కార్మికోద్యమాన్ని బలోపేతం చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. మార్కెట్, ఎఫ్‌సీఐ, కిరాణం ఇలా పలు రంగాల కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి కూలీ రేట్ల పెంపు విషయంలో రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. అటువంటి శ్రీకాంత్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఇచ్చిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మతోన్మాద, కార్పొరేట్ విధానాలపై పోరాటం : పోతినేని
యర్రా శ్రీకాంత్ ఐదు దశాబ్దాల పాటు ఉద్యమాలు నిర్వహించిన వ్యక్తి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని అన్నారు. నేడు కమ్యూనిస్టులపై అనేకమంది దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కమ్యూనిస్టులు అంటే నాకెంతో గౌరవం.. కమ్యూనిస్టుల పోరాటాలు స్ఫూర్తిదాయకం, వారు పేద ప్రజలు, కష్టజీవుల పక్షాన ఉంటారని అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో అక్కడి వామపక్ష ప్రభుత్వం, సీఎం విజయన్‌పై చౌకబారు విమర్శలు చేస్తూ ఊసరవెల్లిలా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయన్‌కు ఓటు వేస్తే మోడీకి ఓటు వేసినట్టు అని దుష్ప్రచారం చేయటం దారుణమని విమర్శించారు. నేడు దేశంలో మతోన్మాదం పెరగడానికి ప్రధాన కారణం బాబ్రీ మసీదు కూల్చివేత నుంచి నేటి వరకు బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్‌గా వ్యవహరించడమేనని అన్నారు. మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికవర్గ పోరాటాలు మరింత బలోపేతం చేయటమే కామ్రేడ్ యర్రా శ్రీకాంత్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
కార్మిక సమస్యలపై పోరాటం : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా
ఖమ్మం నగరంలో సీఐటీయూ నాయకునిగా కార్మికుల సమస్యలపై పోరాడి విజయం సాధించిన వ్యక్తి శ్రీకాంత్ అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు పార్టీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలని కోరుకునేవారని, ఆ దిశగా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, బుగ్గ వీటి సరళ, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, మడుపల్లి గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
నిబద్ధత గల మార్క్సిస్టు యర్రా శ్రీకాంత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



