- Advertisement -
– రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం
– 13936 మందికి లబ్ధి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది యాసంగి రైతుభరోసా నిధులు విడుదల అయ్యాయి.రేపు 22 వ తేది ఆదివారం నెర్మెట్ట లో జరిగే ఆయిల్ ఫెడ్ పామాయిల్ పరిశ్రమ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ మేరకు వ్యవసాయ శాఖ మండల అధికారి పర్సా శ్రీనివాసరావు శుక్రవారం నవతెలంగాణ తో మాట్లాడుతూ మండలంలోని 13936 మంది రైతులకు ఒక్కో ఎకరాని రూ.6 వేలు చొప్పున రూ.9 కోట్ల 23 లక్షల 30 వేల 4 వందల 6 లు మొత్తం ట్రెజరీల్లో జమ అయ్యయాయని, ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నగదును రైతులు ఖాతాల్లో లాంచనంగా జమచేస్తారని తెలిపారు.
- Advertisement -



