Saturday, March 21, 2026
E-PAPER
Homeఖమ్మంరేపే యాసంగి రైతు భరోసా విడుదల

రేపే యాసంగి రైతు భరోసా విడుదల

- Advertisement -

– సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
– అశ్వారావుపేట నియోజకవర్గంలో 45,456 మంది రైతులకు లబ్ధి
నవతెలంగాణ – అశ్వారావుపేట

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 – 26 యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా పథకాన్ని ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన టీజీ ఆయిల్ ఫెడ్ పరిశ్రమ ప్రాంగణం నుండి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు.

ముఖ్యమంత్రి చేసే ప్రసంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన టెలీకాన్ఫరెన్స్ యూనిట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంటేల రవి కుమార్ శనివారం వెల్లడించారు. 

రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం:
అశ్వారావుపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
దమ్మపేట మండలం: నాగుపల్లి క్లస్టర్ (గండుగులపల్లి), మందలపల్లి క్లస్టర్ (మల్లారం), పట్వారిగూడెం.
అశ్వారావుపేట మండలం: నారంవారిగూడెం క్లస్టర్ (అశ్వారావుపేట), నారాయణపురం క్లస్టర్ (నారాయణపురం), అనంతారం క్లస్టర్ (అనంతారం). చంద్రుగొండ మండలం: చంద్రుగొండ, గానుగుపాడు, పోకలగూడెం.
అన్నపురెడ్డిపల్లి మండలం: అన్నపురెడ్డిపల్లి, పెద్దిరెడ్డిగూడెం.
ములకలపల్లి మండలం: ములకలపల్లి, పూసుగూడెం, పొగళ్లపల్లి.
ఈ రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల ద్వారా రైతులు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చని తెలిపారు.

మండలాల వారీగా లబ్ధిదారులు :
యాసంగి రైతు భరోసా కింద అశ్వారావుపేట నియోజకవర్గంలో మొత్తం 45,456 మంది రైతులకు రూ.25.39 కోట్లు అందనున్నాయి.
అన్నపురెడ్డిపల్లి మండలం – 4,838 మంది రైతులు – రూ.2.63 కోట్లు
అశ్వారావుపేట మండలం – 12,950 మంది రైతులు – రూ.7.34 కోట్లు
చంద్రుగొండ మండలం – 6,067 మంది రైతులు – రూ.3.26 కోట్లు
దమ్మపేట మండలం – 11,272 మంది రైతులు – రూ.6.31 కోట్లు
ములకలపల్లి మండలం – 10,329 మంది రైతులు – రూ.5.86 కోట్లు.

హాజరయ్యే ప్రజాప్రతినిధులు:

అశ్వారావుపేట రైతు వేదికలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు పాల్గొననున్నారు.

రైతులు, మహిళా రైతులు, ప్రజాప్రతినిధులు తమ సమీపంలోని రైతు వేదికల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -