- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని జనగాం గ్రామంలో మంగళవారం ఘనంగా ఎల్లమ్మ పండుగ జరుపుకున్నట్టు తెలిపారు. ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం నుండి నైవేద్యాన్ని తీసుకువచ్చి సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధుబాయ్ శ్రీకాంత్ రావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



