Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeఆటలుపసిడి బాణం

పసిడి బాణం

- Advertisement -

ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌
మెన్స్‌ జట్టుకు స్వర్ణ పతకం
జ్యోతి సురేఖ, రిషబ్‌లకు సిల్వర్‌

గాంగ్జూ (దక్షిణ కొరియా) : ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. గతంలో భారత మహిళల, మిక్స్‌డ్‌ జట్లు స్వర్ణ పతకాలు సాధించినా.. పురుషుల జట్టు పసిడి నెగ్గటం ఇదే ప్రథమం. రిషబ్‌ యాదవ్‌, ఆమన్‌ సైని, ప్రతమేశ్‌ త్రయం పురుషుల కాంపౌడ్‌ విభాగం ఫైనల్లో బంగారు పతకం సాధించారు. ఫ్రాన్స్‌తో ఫైనల్లో తొలి మూడు సెట్ల అనంతరం స్కోరు 176-176తో సమమైంది. నిర్ణయాత్మక రౌండ్లో సమిష్టిగా మెరిసిన భారత ఆర్చర్లు 59 పాయింట్లు సాధించగా.. ఫ్రాన్స్‌ 57 పాయింట్లే చేసింది. దీంతో 235-233తో ఫ్రాన్స్‌పై భారత్‌ గెలుపొంది బంగారు పతకం సొంతం చేసుకుంది. అంతకుముందు కాంపౌడ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖతో కలిసి రిషబ్‌ యాదవ్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. నెదర్లాండ్స్‌తో ఫైనల్లో 155-157తో జ్యోతి సురేఖ, రిషబ్‌ యాదవ్‌లు రెండు పాయింట్ల తేడాతో పసిడి పతకం చేజార్చుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad