శ్రీ చైతన్య పాఠశాల నిర్వాకం
నిలదీసిన ఎస్ఎఫ్ఐ నాయకులపై మహిళా ఉద్యోగుల చిందులు
దొంగ చాటుగా తరగతుల బోధన
పట్టించుకోని జిల్లా విద్యాశాఖ
పాఠశాల ఎదుట ఎస్ఎఫ్ఐ నిరసన
పాఠశాల యాజమాన్యంతో ఎంఈఓ కుమ్మక్కు
చర్యలు తీసుకోకపోతే డీఈవో కార్యాలయం ముట్టడిస్తాం
ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి ఏర్పుల తరంగ్
నవతెలంగాణ ఇబ్రహీంపట్నం:
ప్రమాదకరంగా విద్యా బోధన చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలు విద్యాశాఖ ఆదేశాలను బేఖాతలు చేస్తుంది. మండల విద్యాధికారి ఆ పాఠశాలను నిన్న సీజు చేస్తే.. అడ్డదారుల్లో ఆ పాఠశాలలో నేడు ఓపెన్ తరగతులు బోధిస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విద్యాశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవడంలో సమాధి అధికారులు వెనకాడికి వేస్తున్నారు.
శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై ఎస్ఎఫ్ఐ ఆందోళనకు పూనుకుంది. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో దొంగ చాటుగా మరో మార్గంలో విద్యాబోధన కొనసాగిస్తున్న తీరునుపై ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ ఆందోళన సందర్భంగా ఆ పాఠశాల యాజమాన్యం వికృత చేర్చలకు దిగుతోంది. ఎస్ఎఫ్ఐ నాయకుల పైకి మహిళా ఉద్యోగులను ఉసిగొలిపింది. తమ ఇష్టం వచ్చినట్లు నడుపుకుంటామని అడిగే హక్కు మీకు ఎక్కడిది అంటూ ఎస్ఎఫ్ఐ నాయకులపై మహిళా ఉద్యోగులు తిరగబడ్డారు. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా అంటూ నిలదీశారు. ప్రాణాలు పోయిన తర్వాత స్పందిస్తే లాభం ఏమిటంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి ఏర్పుల తరంగ్ మాట్లాడుతూ.. ఒకవైపు విద్యార్థులకు సెలవులు ప్రకటించి, ప్రజలు, విద్యాశాఖను పాఠశాల యాజమాన్యం మోసం చేస్తుందన్నారు. పాఠశాలను మండల విద్యాధికారి సీజ్ చేసిన తర్వాత కూడా దొంగ చాటుగా పాఠశాలను నడిపిస్తున్నారని తెలిపారు.
సీజ్ చేసిన పాఠశాలను తెరిచి అందులో ఉన్న టేబుల్స్, చైర్స్, బెంచెస్ మొత్తం తీసుకొని వెళ్ళడం ఏమిటని ప్రశ్నించారు. ఇదేంటని నిలదీస్తే ఎస్ఎఫ్ఐ నాయకులపైకి శ్రీ చైతన్య యాజమాన్యం వాగ్వాదానికి దిగడంపై మండిపడ్డారు. ఇదే విషయంపై మండల విద్యాధికారిని అడిగితే.. తానే అనుమతి ఇచ్చానని సమాధానం చెప్పడంలోనే అంతర్యం ఉందన్నారు. ఒకసారి సీజ్ చేసిన పాఠశాలలు ఏ విధంగా తెలుస్తారని ప్రశ్నించారు. శ్రీ చైతన్య యాజమాన్యానికి మండల విద్యాధికారి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. వెంటనే శ్రీ చైతన్య పాఠశాలపై, ఆ పాఠశాలకు వత్తాసు పలుకుతున్న మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్షులు బోడ వంశీ, యాచారం మండల అధ్యక్షులు అజయ్, మంచాల మండలం ఉపాధ్యక్షులు జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.




