Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేడు బిబిపేటలో యోగా దినోత్సవం

నేడు బిబిపేటలో యోగా దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేడు ఉదయం 6:30 గంటలకు బీబీపేట మండల కేంద్రంలో తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి బాలుర పాఠశాలలో ప్రారంభమైంది. యోగా గురువు  బండి రాములు, పంపరి శివరాజ్  ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరముల నుండి క్రమం తప్పకుండా మిత్రులు కీర్తిశేషులు మన్నే నర్సింలు ప్రేరణచే నిర్వహించబడుచున్నదనీ బిబిపేట్ యోగ సాధన సమితి సభ్యులు తెలిపారు. యోగా సాధకులు, యోగా ప్రేమికులు, అభిమానులు అందరూ ఎక్కువ సంఖ్యలో హాజరై కార్యక్రమాలు విజయవంతం చేయగలరని, యోగ సమితి సభ్యులు బాసెట్టి నాగేశ్వర్ తెలిపారు. అలాగే శనివారం ఉదయం పాఠశాలకు వచ్చి యోగ అభ్యసించి, ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -