No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్యోగ దినోత్సవం, న్యాయ విజ్ఞాన సదస్సు

యోగ దినోత్సవం, న్యాయ విజ్ఞాన సదస్సు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి : అందరు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఒక బాధ్యత అని, ఒత్తిడిని తగ్గించుకొని మనుగడ సాగించేలా అలవాటు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ జయరాజు తెలిపారు. శనివారం భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, జిల్లా న్యాయశాఖ, న్యాయవాదుల సంఘం  ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ యోగా దినోత్సవం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడారు యోగాసనాలు వేసి ఆరోగ్యం సరిగా చూసుకోకపోతే జీవితం ప్రశ్నర్దాకమవుతుందన్నారు. న్యాయ సేవలు మరింత చేరువలో ప్రజలకు అందేలా, మనిషి నాగరికత అభివృద్ధి చెందాలంటే చట్టం ప్రకారం నడుచుకోవాలన్నారు. విస్మరిస్తే అంతా నష్టమేనని, మానసిక రుగ్మతలకు దారి తీస్తుందని కరోనా కాలం మనకు ఒక గుణపాఠమని తెలిపారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా మాట్లాడుతూ మానసిక ప్రశాంతత అలవర్చుకుంటే, ఎంతటి చిక్కు సమస్య అయినా మనలో మనకే జవాబు దొరుకుతుందని, యోగ నేటి పరిస్థితులలో తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వి. వి. గౌడ్, ఉపాధ్యక్షులు రేణుక, ముఖ్య కార్యదర్శి బోల్లేపల్లి కుమార్, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగస్తులు, ఇతరులు పాల్గొన్నారు. ఈ యోగ కార్యక్రమ గురూజీలుగా గడ్డం శ్రీనివాస్, పబ్బతి సురేందర్, ఆముద బాలరాజులు కార్యక్రమంలో పాల్గొన్న అందరితో యోగాసనాలు వేయించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad