Saturday, May 10, 2025
Homeఖమ్మంయోగాభ్యాసం.. మాల్గుడి కథల శ్రవణం

యోగాభ్యాసం.. మాల్గుడి కథల శ్రవణం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విద్యార్ధులు కోసం నిర్వహిస్తున్న వేసవి శిబిరం ఆహ్లాదంగా సాగుతుంది. ఉపాద్యాయులు రోజుకో అంశం పై విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్ధులకు యోగాభ్యాసం, మాల్గుడి కథల శ్రవణం చేయించారు. ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత ఆధ్వర్యంలో విద్యార్ధులకు ప్రతిరోజు యోగా తరగతులు నిర్వహించడంతో పాటు మాల్గుడి కథలు వినిపిస్తున్నారు. ఆర్.కె.నారాయణ రచించిన మాల్గుడి సిరీస్  కథలు అత్యంత సామాజిక స్పృహను కల్గిస్తాయి. దక్షిణ భారత దేశంలోని మాల్గుడి గ్రామం చుట్టూ అల్లుకున్న కథలు అక్కడి సామాజిక జీవన చిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. విద్యార్ధి జీవితంలో ఈ కథలను వింటే అక్కడి సామాజిక జీవన విధానం మనుషుల భావనలు అవగాహనకు వస్తాయనే ఉద్దేశ్యంతో ఈ కథలు వినిపించడం వేసవి శిబిరంలో షెడ్యూల్ గా రూపొందించారు. ప్రతిరోజు విద్యార్ధులకు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా ఈ కథలను వినిపించి అనంతరం విద్యార్ధుల మధ్య చర్చ పెడుతున్నారు. ప్రతీరోజు యోగా చేయించడంతో పాటు మాల్గుడి కథలు  తమకు ఎంతగానో ఉపయోగంగా ఉన్నాయని విద్యార్ధులు అంటున్నారు.   ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిషోర్,పుల్లయ్య, వెంకటేశ్వర్లు,పి.ఇ.టి రాజు, సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -