- Advertisement -
ఎక్కడ లేవని నీవు..?
అంతా నీవే
అన్నిటా నీవే.. అన్నీ నీవే…..
నాకు నీ దూరం భౌతికంగా మాత్రమే
నా మనసు లోగిలిలో..
నా హదయ వాకిలిలో..
అతి దగ్గరగా నీవే.. నీవు..!
అనునిత్యం నా అంతరంగంలో
అంతులేని ఆలోచనల్లో అలుపురాని మది తలపుల్లో
ఆగలేని కన్నీటి ప్రవాహంలో
అణువణువున నిండి ఉన్నావు….
ఎక్కడ లేవని నీవు..?
కరిగిపోని కలల్ని కళ్ళల్లో దాచుకుని హది నిండా
నీ రూపాన్ని నింపుకుని వేల వేల భావాలను పదిల పర్చుకుని
నా పెదాలపై పల్లవించే.. నీవనే తీయని పరిమళాలను
ఆస్వాదిస్తూ… అనుభవిస్తూ…
తపించి.. పరితపించి పోతున్నాను.
క్షణమొక యుగమైనా యుగయుగముల
పయనమైనా అలసిన జీవనయానంలో
పారిజాత పూల వింజామరలా
నాలోనే నువ్వు
అది నేనైన నువ్వు
ఎక్కడ లేవని నీవు..?
అంతటా నీవే.!
- పొన్నం రవిచంద్ర, 9440077499
- Advertisement -