- Advertisement -
విముక్తం వైపుయు ఆర్ నాట్ అలోన్
నిన్నూ నీ మస్తిష్కాన్నీ ఆసాంతం ఆవహించి
నిన్ను తనకు బానిసను చేసి
నీపై గమ్మత్తైన పెత్తనం చేస్తున్న
ఓ అజ్ఞాత అలవాటును గమనించు
నీకు అది వ్యసనమో
దానికి నువ్వు వ్యసనమో తడుముకో
ఏమిటా చూపుల లౌల్యము
దురలవాట్లను దూరంగా నెట్టూ
అడుగడుగునా తప్పటడుగులు కావు తప్పులే
ఆగకుండా కదులు తున్నవి అప్పులే
వీడకుంటే బ్రతుకంతా తిప్పలే
రేసులపై కాసులా వాసూ
అసువులు తప్పవేమో సుభాసూ
అంతా మాయా జూదపు పచ్ఛీసూ
కళ్ళు తెరిస్తేనే నువ్వు శెభాసు
వాక్యూమ్ లాగా నిన్ను పీల్చేస్తున్న వ్యసనం నుంచీ
తక్షణమే నిష్క్రమించు
నిన్ను అస్థిర పరిచే
పీడనల విముక్తం వైపు అడుగేరు..!
– డా.కటుకోఝ్వల రమేష్, 9949083327
- Advertisement -