Sunday, February 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ రైజింగ్‌కు మీరే బ్రాండ్‌ అంబాసిడర్లు

తెలంగాణ రైజింగ్‌కు మీరే బ్రాండ్‌ అంబాసిడర్లు

- Advertisement -

హార్వర్డ్‌ వర్సిటీ విద్యార్థులతో రేవంత్‌రెడ్డి
ఏఐ పాలసీ సింపోజియం ప్రారంభోత్సవానికి సీఎంకు ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం విద్యార్ధులను ఆహ్వానించారు. అమెరికా పర్యటన చివరి రోజు శనివారం హార్వర్డ్‌ వర్సిటీలోని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు, ఇతర వర్సిటీల విద్యార్ధులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. లీడర్‌షిప్‌, ఆర్థిక వృద్ధి, స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ సమస్యలు, రైతులు, మహిళలు, యువత సాధికారిత,సంక్షేమం తదితర అనేక అంశాలపై విద్యార్ధులు సీఎం రేవంత్‌తో మాట్లాడారు.

తెలంగాణ రైజింగ్‌ 2047 లక్ష్యాలు, ఉద్దేశ్యాలను విద్యార్ధులకు సిఎం వివరిం చారు. తెలంగాణ రైజింగ్‌లో భాగస్వామ్యం కావాలని కోరారు. నాయకత్వం, దార్శనికతపై క్లాసులు తీసుకో వాలని విద్యార్ధులు కోరగా.. హార్వర్డ్‌ వర్సిటీలోని ప్రముఖ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లను బోధన చేయడమే ఉత్తమమని సీఎం వారితో అన్నారు. భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ నాయకత్వ పాత్ర పోషిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నదని సీఎం వివరించారు. తెలంగాణ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని సమావేశానికి హాజరైన విద్యార్ధులు సీఎంకు హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం
హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ మార్చిలో నిర్వహించే తొలి ఎఐ పాలసీ సింపోజియంను ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ డీన్‌ జెరెమీ వైన్‌స్టీన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. సీఎం స్పందిస్తూ, హైదరాబాద్‌ నుండి వర్చువల్‌గా హాజరవుతానని తెలిపారు. కాగా, హార్వర్డ్‌ వర్సిటీలో ఇటువంటి అకడమిక్‌ ప్రోగ్రాం ప్రారంభ ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి కావడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -