- Advertisement -
నీవు వచ్చేసరికి
నేనున్నా లేకున్నా
నా ప్రేమ ఆహ్వానిస్తుంది
నా మనసు పలకరిస్తుంది
నా ఇల్లే అనుకొనేవు
నీవు కొలువున్న కోవెలిది
తిరిగి వెళ్ళేటప్పుడు
ఎలా వచ్చావో అలానే వెళ్ళు
ఒక్క గుర్తునూ పట్టుకుపోకు
పట్టుకుపోయావో నిను వీడని
జ్ఞాపకమై అల్లుకుపోయి
జీవితాంతం పరిమళిస్తుంటే
మళ్ళీ నీలా నీవు బతకలేవు
– సురేంద్ర రొడ్డ, 9491523570
- Advertisement -