Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదు

సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదు

- Advertisement -

మీ స్థాయికి తగ్గట్లుగా నువ్వు మాట్లాడు..
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏంటో నీకు చూపిస్తాం..
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైర్..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

ముఖ్యమంత్రి స్థాయిని మరిచి ముఖ్యమంత్రిపై తప్పుడు ఆరోపణలు చేయడం నీ స్థాయికి తగ్గ పని కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. సోమవారం నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ప్రకృతి వైపరీత్యం జరిగితే రైతులను ఆదుకోవాల్సింది పోయి రైతుల దగ్గరికి వెళ్లి రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూడలేకే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ పేదల గురించి ఏ ఒక్కరోజు కూడా ఆలోచించలేదన్నారు.

పది సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు గానీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు గాని ఇవ్వలేదన్నారు 371 ఇందిర ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. రైతులకు 5438 మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. పోచారం ప్రధాన కాలువకు గండ్లు పడితే కోటి తొమ్మిది లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. గతంలో చెరువుల పరిస్థితి ఏంటో ఇప్పుడు మరమ్మతులు చేసిన తర్వాత చెరువు పని స్థితిలో ఎలా ఉన్నాయో జాగమీదికి వెళ్లి పరిశీలిద్దాం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు.

గత 50 సంవత్సరాలుగా రాణివిపత్తు ఇప్పుడు రావడం జరిగిందని దానికి ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. రైతులకు కచ్చితంగా నష్టపరిహారం అందించే విధంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ది విటి కిష్టయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు సంజీవులు,  మైనార్టీ అధ్యక్షులు ఇమామ్, మాజీ ఎంపీటీసీ ప్రభు గౌడ్, రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శివ కమార్ , షాయద్ పాషా, కిష్టయ్య ,ఆరిఫ్, శ్రీనివాస్, మహేష్ రెడ్డి, జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -