Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీ ఊరిని మీరే బాగు చేసుకోవాలి..

మీ ఊరిని మీరే బాగు చేసుకోవాలి..

- Advertisement -

మీ నుంచే నాయకుడు రావాలి..
ప్రజలకి ఆమ్ ఆద్మీ పిలుపునిస్తుంది..
నవతెలంగాణ – ఆర్మూర్ 

మీ ఊరిని మీరే బాగు చేసుకోవాలి, మీ నుంచి నాయకుడు రావాలి అని  ఆమ్ ఆద్మీ పార్టీ  నియోజకవర్గ ఇన్చార్జ్ సయ్యద్ ఆఫీస్ మంగళవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో సామాజైన ప్రజలే పోటీ చేయాలని ఆయన అన్నారు. గెలిచిన నాయకులు తనుకుతనే అభివృద్ధి చేసుకోవడం ప్రజలు చూశారు ఊరు మాత్రం అభివృద్ధి కాలేకపోయింది రోడ్లు సరిగా కాలేవు డ్రైనేజ్ సమస్య ఇంతకుముందు అంతే ఉండే ఎప్పటికి కూడా అంతే ఉంది ఊర్లలో ఎలక్ట్రికల్ సిటీ పోల్స్ సరిగా లేవు లైట్లు సరిగా లేవు. ఊరికి వెళ్లే రోడ్డు కూడా సరిగా లేదు. గతంలో గెలిచిన నాయకులు ఇప్పటివరకు రోడ్లు మరమ్మతు చేపలేరు కొత్త రోడ్లు ఏపీ లేరు ఊరికి వెళ్లి రోడ్లు కాకుండా మన గల్లీలో ఉన్న రోడ్లు కూడా సరిగా చేయలేకపోయారు మీకోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అవకాశాన్ని కల్పిస్తుంది యువత, మహిళలు ముందుకు రావాలని కోరినారు.

మన ఊరు సమస్యలన్నీ మనమే పరీక్షించుకోవాలి మన ఊర్లో రోడ్లు వేపించుకోవాల్సిన బాధ్యత మనది సరిగా చేయించుకోవాల్సిన బాధ్యత మనదే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చదువు ఎలా చెప్తున్నారు ? వాళ్ళ స్కూల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి తెలుసుకొని ఆ సమస్యల మీద పనిచేయాలని ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ ముంగటికి సాగుతుంది గతంలో ఉన్న నాయకులు ఒక్కసారైనా ప్రభుత్వ పాఠశాలలో వెళ్లి స్కూల్లో విద్యార్థులు ఎలా చదువుతున్నారు. వాళ్లకు మధ్యాహ్నం భోజనం ఎలా పెడుతున్నారు వాళ్ళ పాఠశాలలో తాగే నీళ్లు వస్తుందా వాళ్లకు బాత్రూంలో సరిగా ఉన్నాయా.. అని ఏ విద్యార్థితోనే మాట్లాడలేకపోయారు. ఇది కూడా మన బాధ్యతనే. ఇప్పుడు మార్పు రావాలి యువత మహిళలు ముంగటికి రావాలి. మన ఊరు సమస్యలన్నీ మనమే  పరిష్కరించుకోవాలని, అమ్ ఆద్మీ పార్టీ మీకు అవకాశం ఇస్తుంది.  నియోజకవర్గం ప్రజలు దీన్ని తప్పకుండా వాడుకోవాలని సూచిస్తుంది మీరు ఎవరైనా పోటీ చేయాల ఉద్దేశం ఉంటే ఈ నంబర్కు  8333886603 సంప్రదించాలని కోరినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -